యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 29 థియేటర్లలో ఈ సినిమా 1.08 గంటలకే ప్రీమియర్ షోలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో మొదటి రోజు 6 షోలు, 29 థియేటర్లలో మాత్రం 7 షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కొన్ని థియేటర్లలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది. థియేటర్లో టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ నిర్వహించారు తహసీల్దార్. అర్ధరాత్రి షో కు ముందుగానే అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు తహసీల్దార్. థియేటర్ అనుమతి, అధిక షోలకు అనుమతులు, టికెట్ల పెంపుపై అనుమతులు పరిశీలిస్తున్నారు తహసీల్దార్. సమాధానం ఇవ్వటంలో థియేటర్ యాజమాన్యం తడబడుతోంది. ఇష్టా రాజ్యంగా వ్యవహరించడంతో థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్.