BREAKING : మే 20 నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

-

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 20వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ లకు ఎండాకాలం సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

జూన్ 15వ తేదీన తిరిగి కాలేజీలు పున ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా పాటించాలని… విద్యా శాఖ వెల్లడించింది. విద్యాశాఖ నిబంధనలను పాటించండి ఆయా కాలేజీల పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news