తారక్ ప్రొడ్యూసర్స్‌పై ఫ్యాన్స్ ట్రోలింగ్..అప్‌డేట్ ఇవ్వకుంటే తడాఖా చూపిస్తామని హెచ్చరిక

-

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా పాన్ ఇండియా ప్లానింగ్స్ అవుతుండటం విశేషం. కాగా, ఈ నెల 20న ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇంకా నాలుగు రోజుల్లో తారక్ బర్త్ డే రాబోతున్న సందర్భంగా ఇప్పటి నుంచే సంబురాల ప్లానింగ్ చేయాలని తారక్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్ నటించబోయే #NTR 30 ఫిల్మ్ అప్ డేట్ కోసం డిమాండ్ ను సోషల్ మీడియా వేదికగా పెట్టేశారు.

నాలుగు రోజుల్లో తారక్ జన్మదినం రాబోతున్న సందర్భంగా అతి త్వరగా అప్ డేట్ ఇవ్వాలని కోరుతూ NTR 30ని ప్రొడ్యూస్ చేయబోయే యువసుధా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్స్ ను ట్రోల్ చేస్తున్నారు. నిద్రపోయిన యువసుధా బ్యానర్ ప్రొడ్యూసర్స్ నిద్ర లేవాలని అంటూ #NidraLeguraPukaYuvasudha..హ్యాష్ ట్యాగ్ నిద్ర లెగురా***యువ సుధ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్స్ చేస్తున్నారు. అలా అభిమానుల వరుస ట్వీట్స్ తో సదరు హ్యాష్ ట్యాగ్ మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అప్ డేట్ ఇవ్వకపోతే తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా కొందరు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news