కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత… తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు పోరు రసవత్తరంగా సాగనుంది. మొన్నటివరకు బిజేపి రేసులో ఉంది..కానీ అనూహ్యంగా ఆ పార్టీ వెనుకబడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి భారీగా నేతలు వస్తున్నారు.
అయితే, తాజాగా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, NZB జిల్లా బాల్కొండ నేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. 2018 ఎన్నికల్లో BJP టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓట్లతో రెండో స్థానం దక్కించుకున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.