గ్రూప్ 1 పరీక్ష పై సుప్రీం కోర్టు తీర్పు ఆదేశాలు విడుదల చేసింది. నవంబర్ 20 కల్లా గ్రూప్ 1 పరీక్ష పై దాఖలైన పిటిషన్ లను విచారించాలని తెలంగాణ హై కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చింది. అలాగే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదల కు ముందే కేసు చేపట్టాలని సూచింది. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నాం.
అందుకే గ్రూప్ వన్ విద్యార్థుల అప్లికేషన్ లో జోక్యం చేసుకోవడం లేదు. నవంబర్ 20న హైకోర్టులో తదుపరి విచారణ ఉంది. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు వెలువడక ముందే నవంబర్ 20 కల్లా హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టాలి అని స్పష్టం చేసింది. అయితే గత కొన్నిరోజులుగా తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన వార్తలు చర్చల్లో ఉన్న విషయం తెలిసిందే. విద్యార్థుల నిరసనలతో దుమారం రేపిన గ్రూప్ 1 పరీక్ష ఈరోజు జరిగింది.