సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెయిన్ తీర్పు పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మసనం ప్రస్తావించింది. సుప్రీం కోర్టు అంటే గౌరవం లేదా..? అని నిలదీసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కి గౌరవం లేకపోతే ఎలా..? అని ప్రశ్నించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యత ఉండాలని.. అలా ఎలా మాట్లాడతారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. తాము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోమని.. తాము తమ విధిని మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. తాము ప్రమాణ పూర్వకంగా మాత్రమే పనిచేస్తామని స్పష్టం చేసింది.

చట్టసభల పరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోమనే విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణని రాష్ట్రం బయటే నిర్వహిద్దామని న్యాయమూర్తులు మండిపడ్డారు. అనంతరం ఓటుకు నోటు కేసు విచారణ సెప్టెంబర్ రెండవ తేదీకి వాయిదా వేసింది సుప్రీం.

Read more RELATED
Recommended to you

Latest news