సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. కారులో నలుగురు పురుషులు, ఒక మహిళ పాప వున్నారు. వీరు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్నట్టు గా తెలుస్తుంది.

బ్రేక్ డౌన్ అయిన లారీ రోడ్డుపై హైవే పక్కనే నిలబడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. గత మూడు రోజుల క్రితం కూడా ఇదే విధంగా టిప్పర్ కారు ఢీకొనడంతో యువ జంట మృతి చెందిన సంఘటన మరువకముందే మరోసారి కోదాడ ప్రాంతంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం.
వేసవి కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు రాత్రిపూట ప్రయాణం చేయడం, రోడ్డుపై ఆగి ఉన్న వాహనం గమనించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.