నేడు ఏపీ, తెలంగాణ మ‌ధ్య చ‌ర్చ‌లు..! బ‌స్సుల రాక‌పోక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. నిజానికి.. గత నెలలో కూడా రెండురాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రెండురాష్ట్రాలు సమాన దూరం నడుపుకుందామన్న ప్రతిపాదనకు ఏపీ అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొన్నది. తెలంగాణలో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన వెయ్యిబస్సులు దాదాపు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తుండ‌గా.. ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 750 బస్సులు 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి.

అయితే.. ఇరు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ గత ఆదివారం ఉంటుందని అనుకున్నారు. అయితే.. అధికారుల మధ్య ఒప్పందం జరిగిన తర్వాతే మంత్రుల భేటీ జరుగనున్నట్లు సమాచారం. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ అనంతరం రెండురాష్ట్రాల మధ్య సర్వీసులు నడవడంలేద‌న్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంగళవారం జరిగే సమావేశంలో అధికారులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news