6 నెలల్లో మెగా డీఎస్సీ – గవర్నర్ తమిళిసై

-

ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గవర్నర్ కమిలి సౌందర్ రాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని చెప్పారు. “తొలి అడుగులోనే సంక్షేమానికి కొత్త ప్రభుత్వం నాంది పలికింది. ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది” అని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

పదేళ్ల నిర్బంధపు పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి విజ్ఞతను నేను అభినందిస్తున్నాను. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోందని వివరించారు. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందింది. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు ద్వారా చెప్పిందన్నా రు. అడ్డు గోడలు, అద్దాల మేడలు పటాపంచలై.. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news