పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బిజెపి నేతలు, క్యాడర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ రానున్నారని తెలిపారు. బిజెపి కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
టిఆర్ఎస్ బిజెపి పొత్తు ఉంటుందనేది కేవలం ప్రచారం మాత్రమే.. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బిజెపికి మంచి అవకాశం ఉంది సర్వే సంస్థలకు సైతం అందరి విధంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. రేపట్నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారు మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు.