మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్రం అడిగిన వివరాలు అధికారులు ఇవ్వలేదు : టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్

-

మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్రం అడిగిన వివరాలు అధికారులు ఇవ్వలేదని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ అన్నారు. ఎన్‌డీఎస్‌ఏకు సమాచారం ఇవ్వాలని చట్టం కూడా ఉందని, ఇప్పటి ప్రభుత్వం కూడా మేడిగడ్డ వివరాలు ఇవ్వట్లేదని తెలిపారు. నాలుగు నెలల తర్వాత రాహుల్‌ బొజ్జా ఎన్‌డీఎస్‌ఏకు లేఖ రాశారని, ఇప్పటికైనా ఎన్‌డీఎస్‌ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్‌డీఎస్‌ఏ విచారణ చేయగలుగుతుందని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడారు.

“మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్‌ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సింది. జియోలాజికల్‌ సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతి పెద్ద తప్పు. థర్డ్‌ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరం. ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్‌ రిపోర్టులు ఇవ్వాలి. మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లీషన్‌ రిపోర్టు ఇచ్చారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. వచ్చేవారం ఎన్‌డీఎస్‌ఏ కమిటీ రాష్ట్రానికి వస్తుంది. అడిగిన సమాచారం ఎన్‌డీఎస్‌ఏ కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుంది.” అని శ్రీరామ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news