కన్ ఫాం.. ఇక మీ ఇష్టం: స్పష్టం చేసిన కేటీఆర్!

-

కరోనాపై టెస్టులు చేస్తాం.. మందులిస్తాం.. అది వైద్య సిబ్బంది చూసుకుంటారు. లాక్ డౌన్ అనే ఆలోచన ప్రభుత్వం మదిలో లేదు! ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి.. ఫలితంగా పరిపాలనలో ఇబ్బందులు రావొచ్చు… ఫలితంగా రాజకీయంగా ప్రతిపక్షాల చేతికి చిక్కొచ్చు… సో నో లాక్ డౌన్… ఎవడి చావు వాడు చావండి.. ఎవడి బ్రతుకు వాడు బ్రతకంది.. ఎవడి జాగ్రత్తలు వారు తీసుకోండి! ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా చెప్పిన మాటలు ఇవి!


ఇది బాధ్యతా రాహిత్యమా.. ప్రశ్నించేవారు లేరనే ధైర్యమా.. ఇంతకు మించి ఏమీ చేయలేమనే చేతులెత్తేసిన తనమా.. కరోనా విషయంలో జాగ్రత్తలు ప్రజలకే వదిలేసిన ఆలోచన ఫలితమా.. అన్నింటికీ మించి రాష్ట్ర ఖజానాకే ఇస్తున్న ప్రాధాన్యమా.. ఇలా వస్తున్న ప్రశ్నల సంగతి తెలంగాణ ప్రజలకు వదిలేస్తే… తాజాగా “లాక్ డౌన్” విషయం పై కేటీఆర్ ఆల్ మోస్ట్ “ఉండదు” అనే విషయం కన్ ఫాం చేసినట్లే!

కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రథం,టెలీ మెడిసిన్‌ ను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన కేటీఆర్… “ఎవరూ నాకు కరోనా రాదు అనే అపోహతో ఉండొద్దు.. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య.. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు… ఫలితాలు దాస్తున్నారు అనడం సరికాదు.. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ పెడితే ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.. ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలి” అని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version