తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను https://results.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సుమారు 5,05,813 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు, 11,606 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 20లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.
ఫలితాలు ఇలా చెక్ చేస్కోండి
ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయాలి.
తర్వాత స్క్రీన్ మీద కనిపించే Results ఆప్షన్పై క్లిక్ చేయాలి.
స్క్రీన్పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Hall Ticket Number ఎంటర్ చేసి Submit బటన్పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ కనిపిస్తాయి.
ఆ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
10th results