Breaking : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం మృతి

-

తెలంగాణ సాయుధ రైతంగా పోరాట యోధురాలు మ‌ల్లు స్వరాజ్యం (91) కాసేప‌టి క్రితం క‌న్నుమూశారు. కాగ మ‌ల్లు స్వ‌రాజ్యం అనారోగ్యంతో భాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆమె కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. కాగ ఆమె ఆరోగ్యం విషమించ‌డంతో కాసేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. కాగ మ‌ల్లు స్వ‌రాజ్యం 1945-46 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం లో పాల్గొన్నారు. అదిలాబాద్, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ తో పాటు ప‌లు జిల్లాల్లో మ‌ల్లు స్వ‌రాజ్యం పోరాటం చేశారు.

అలాగే నిజం స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా తూపాకి ప‌ట్టి కూడా అనేక పోరాటాలు చేశారు. సాయుధ పోరాటం తర్వాత‌.. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లోనూ మద్య‌పాన వ్య‌తిరేక పోరాటంలో కూడా మ‌ల్లు స్వరాజ్యం పాల్గొన్నారు. మ‌ద్యపాన వ్య‌తిరేక ఉద్యోమంలో చాలా రోజుల పాటు పోరాటం చేశారు. కాగ రాజ‌కీయంగా మ‌ల్లు స్వ‌రాజ్యం మ‌ర‌ణించేంత వ‌ర‌కు.. సీపీఎం పార్టీతోనే ఉన్నారు.

ఆ పార్టీలో ప‌లు కీల‌క బాధ్య‌త‌ల‌ను కూడా మ‌ల్లు స్వ‌రాజ్యం నిర్వ‌హించారు. కాగ మ‌ల్లు స్వరాజ్యం గ‌త కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉండ‌టంతో రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. కాగ మ‌ల్లు స్వ‌రాజ్యం మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news