తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కోసం జరిగిన ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ఇక ఆ తర్వాత జరగనున్న కార్యక్రమాలపై కొత్త సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర కొత్త శాసనసభ రేపు కొలువు తీరనుంది. నూతన శాసనసభను రేపు సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం కంటె ముందే ప్రొటెం స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది. ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ చేl రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మిగిలిన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభాపతి ఎన్నిక చేపడతారు. తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ను ఎనుకున్న విషయం తెలిసిందే. కొత్త శాసనసభ మొదటి శాసనసభ సమావేశం అవుతున్న తరుణంలో ఉభయ సభల సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. సభాపతి ఎన్నిక అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత వస్తుంది.