శాసనసభ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించింది. సభలో సీఎం కేసీఆర్‌ సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సాయన్న మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు.

సాయన్న లేని లోటు పూడ్చలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. కంటోన్‌మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని సాయన్న పరితపించారని గుర్తు చేశారు. నిరంతరం ప్రజల కోసం తపించిన ప్రజానాయకుడు సాయన్న అని కొనియాడారు. అనంతరం సభలోని సభ్యులంతా సాయన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. పార్టీలకతీతంగా బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సాయన్న సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులంతా బలపరిచారు.

మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. వరదల్లో ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండలిలో చర్చ జరుగుతోంది. ఒకేసారి రైతు రుణమాఫీ చేసినందుకు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన కేసీఆర్‌కు మ్మెల్సీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news