రేపే బీజేపీ తుది జాబితా.. 26 స్థానాలు కోరిన జనసేన.. 10 ఇవ్వాలని నిర్ణయం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే రెండు విడతల్లో తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. అయితే బీజేపీ మాత్రం రెండో విడతలో కేవలం ఒక అభ్యర్థి పేరు మాత్రమే ప్రకటించింది. ఈ క్రమంలో మూడో విడత జాబితాకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే రాష్ట్రంలో జనసేనతో కలిసి పోటీలోకి దిగుతున్న బీజేపీ.. ఈ పొత్తులో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే రెండు విడతల్లో 53 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షం జనసేనకు సీట్ల కేటాయింపుపై దిల్లీలో జేపీ నడ్డా నివాసంలో భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ భేటీలో అమిత్ షా కూడా పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అయితే తెలంగాణలో జనసేన 26 సీట్లు కోరుతుండగా.. బీజేపీ మాత్రం 10 స్థానాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ వ్యవహారంపై ఇవాళ సాయంత్రం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఇక సీఈసీ భేటీ తర్వాత రేపు రాష్ట్రంలో బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news