తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు అమాంతం పడిపోయాయి. అసలు భూములు కొనేందుకు కూడా ఇద్దరు ముందుకు రావడం లేదు. కెసిఆర్ ప్రభుత్వం దిగిపోవడంతో… ఈ పరిస్థితి నెలకొంది. అయితే రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెంచేలా చర్యలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్.
తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు.. సెప్టెంబర్ లో పెరిగే ఛాన్స్ లు ఉన్నాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంత మేర ధరలు పెరగవచ్చు అనే దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతుందని కూడా తెలిపింది. దీనిపైన రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం.
ఇక అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వనుందట ఈ రిజిస్ట్రేషన్ల శాఖ. ఆ తర్వాత రెవెన్యూ మంత్రి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు అధికారులు. ధరల పెంపు ప్రతిపాదనను సంబంధిత వెబ్సైట్లో ఉంచి ప్రజాభిప్రాయం సేకరిస్తారని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రక్రియకు మరో 30 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.