తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు

-

వచ్చే ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఆయా శాఖలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది.

మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలపై అన్నిశాఖలతో ఆర్ధికశాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు ఈనెల 18వ తేదీ నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రులు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది.

ఈ సమావేశాల్లో గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుకు పద్దు కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగ నియామాకాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్రప్రభుత్వంఓటాన్ అకౌంట్‌కు వెళ్తుందా లేదా పూర్తిబడ్జెట్ ప్రవేశపెడతారా అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version