వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్‌తో సీఎం రేవంత్ భేటీ

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్‌పర్యటన కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఒంటిగంటకు దిల్లీ నుంచి బయలు దేరిన సీఎం బృందం.. సోమవారం మధ్యాహ్నం జురిచ్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ పలువురు ప్రవాస భారతీయులను రేవంత్ రెడ్డి కలిసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం దావోస్‌కు సీఎం బృందం వెళ్లింది.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా ఉపప్రధాని మేకొనెన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై వారితో చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టీమ్.. సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈవోలతో చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలువనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version