తెలంగాణ బడ్జెట్ 2024.. ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే?

-

ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకదాని వెంట మరొక హామీ అమలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేసింది. ఈ గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు భారీ మొత్తంలో పద్దు కేటాయించింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం – రూ.723 కోట్లు, గృహజ్యోతి పథకం – రూ.2,418 కోట్లు కేటాయించింది.

మహిళలను మహాలక్ష్మిగా గౌరవించే మన సంస్కృతిలో భాగంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానకి తీసుకువచ్చిందే గృహజ్యోతి పథకం. నిరుపేద కుటుంబాల కోసం రూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.723 కోట్లు ప్రతిపాదించారు. మరోవైపు గృహజ్యోతి పథకం కింద ఈ బడ్జెట్‌లో 2,148 కోట్ల రూపాయలు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news