8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారం.. కళ్లు లేని అమ్మాయి అంటూ పట్టించుకోని పోలీసులు

-

ఎనిమిదేళ్ల అంధ బాలిక పై అత్యాచారం చేశాడు ఓ దుర్బుద్దుడు. అయితే ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. కళ్లు లేని అమ్మాయి అంటూ పట్టించుకోలేదు మలక్ పేటల పోలీసులు. వివరాల్లోకి వెళ్లితే.. వికారాబాద్ కి చెందిన ఎనిమిదేళ్ల బాలిక మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధ బాలికల వసతి గృహంలో చదువుతోంది. ఇదే వసతి గృహంలో పని చేసే నరేష్ (24) అనే యువకుడు బాలిక పై అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. 

బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లకుండా బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు వసతి గృహం సిబ్బంది.   బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మలక్ పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు తల్లిదండ్రులు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే బాలిక అంధురాలు అని, తాను చూడలేదని, ఆమె చెప్పే దాన్ని నమ్మలేమంటూ, ఊరికి తీసుకెళ్లి వైద్యం చేపించండని ఫిర్యాదు తీసుకోలేదు పోలీసులు. బాలికకు రక్తస్రావం ఆగకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిలోఫర్ డాక్టర్లు. అప్పుడు విచారణ జరిపి రేప్ చేసిన వసతి గృహంలో పని చేసే నరేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బాలికపై అత్యాచారం జరిగితే పట్టించుకోని వసతి గృహం సిబ్బందిపై, ఫిర్యాదుకు వెళ్తే తీసుకొని మలక్ పేట్ పోలీసులపై తీరా విమర్శలు చేస్తూ ఆందోళన చేశారు స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news