టీటీడీ ఛైర్మ‌న్‌గా ఆ ఛాన‌ల్ య‌జ‌మాని…!

-

టీటీడీ ఛైర్మెన్‌ ఎవరు…? అనే ఊహాగానాలకి త్వరలోనే తెర పడబోతున్నట్లు అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు చాలామందే ఛైర్మ‌న్ రేసులో ఉన్నా రు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన తొలిరోజుల్లోనే ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు టీటీడీ ఛైర్మ‌న్ కాబోతున్నార‌నే టాక్ న‌డిచింది. అయితే దీనిపై నాగ‌బాబే స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి ప‌ద‌వులు ఆశించ‌డం లేద‌ని తేల్చేశారు. ఆత‌రువాత ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీమోహ‌న్ పేరు కూడా తెర‌మీదికొచ్చింది.

వారితో పాటు కేంద్ర మాజీమంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పేరు కూడా వినిపించింది. అయితే ఎవ్వ‌రూ ఈ వార్త‌ల‌ను ఖండించ‌లేదు. ఇటీవ‌ల టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి గురించి డిప్యూటీసీఎం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ ప‌ద‌వి కోసం 50 మందికి పైగా త‌న‌కు విన‌తులు ఇచ్చార‌ని.. దీనిని చంద్ర‌బాబుకి ఎలా వివ‌రించాలో అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై పోటీ పెరుగుతున్న దృష్ట్యా త్వ‌ర‌గా తేల్చేయాల‌ని ప్ర‌భుత్వం డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానాల పాలకమండలి కొత్త ఛైర్మెన్‌గా ఓ టీవీ ఛాన‌ల్ అధినేత‌ను చంద్ర బాబు నియమించబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వ‌ర్గాల నుంచి సమాచారం అందుతోంది. చిత్తూరుజిల్లాకి చెందిన ఆయ‌న పారిశ్రామికవేత్తగా, ఓ టీవీ ఛాన‌ల్ సంస్థ య‌జ‌మానిగా స‌మాజానికి సుపరిచితులు. ఆయనకి ‘హిందూ ధర్మం’ అనే భక్తి ఛానెల్‌ కూడా న‌డుపుతున్నారు. గత అయిదేళ్లుగా వైసీపీ సిద్ధాంతాలని, ఆ పార్టీ పాలనా విధానాలని ఆయన తన‌ మీడియా ద్వారా తీవ్రంగా వ్యతిరేకించారు.

వైసీపీ నేతలు వాడిన బూతుపురాణాలను కూడా త‌న ఛానెల్‌ ద్వారా ఖండిచారు. ఇదే క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న‌న్ను వైసీపీ పాల‌కులు వ‌దిలిపెట్ట‌లేదు. ఆయనపై అనేక రకాల కేసులుపెట్టారు. అంతే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనని తిట్టించారు. కేబుల్‌ ఆపరేటర్లని బెదిరించి ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఛానెల్‌ ప్రసారాలని నిలిపేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ జంకలేదు, వైసీపీ నేత‌ల‌ను ధీటుగా ఎదుర్కొన్నారు.

నామినేట్ పోస్టుల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్న చంద్ర‌బాబుకి స‌ద‌రు టీవీ ఛాన‌ల్ య‌జ‌మాని టీటీడీ బోర్డ్ ఛైర్మ‌న్‌గా స‌రిపోతార‌ని అనిపిస్తోంది. ప్ర‌స్తుత కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, టీడీపీలోని సీనియ‌ర్ నాయ‌కులు ఆయ‌న అభ్య‌ర్ధిత్వానికి ఓకే చెన్పిన‌ట్లు స‌మాచారం. కూటమి విజయంలోఆ ఛానెల్‌ కూడా భాగస్వామి కాబ‌ట్టి ఆయ‌న‌కు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని రిక‌మెండేష‌న్‌లు అందాయి. అటు చంద్ర‌బాబు కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు టీవీ ఛాన‌ల్‌కు కృతజ్ఞతగా ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వరస్వామి సేవాభాగ్యం కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి కోటరీ నుండి సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news