తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలనే సిఫారసులను గవర్నర్ తమిళి సై తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫివర్, దగ్గుతో బాధపడుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో ప్రగతిభవన్ లోనే సీఎం కేసీఆర్ కు యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్ తగ్గేవరకు అక్కడే వైద్యులు ఉండనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని కేటీఆర్ తెలిపారు.