తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారట. గతేడాది వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకం అమలు చేసిన విషయాన్ని వారికి తెలియజేస్తారని తెలుస్తోంది.
దీనిపై వరంగల్ లో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని, ఆహ్వానించనున్నట్లు సమాచారం. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘సవాలు చేసిన వారిని రాజీనామా చేయమని మేం అడగం. మీరెలాగూ పారిపోతారని మాకు తెలుసు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ మాట ఇస్తే అది శిలాశాసనం. దాన్ని తప్పరు. గాంధీ కుటుంబం రాజకీయ ప్రయోజనాలకోసం మాట ఇవ్వదు’ అని ఆయన స్పష్టం చేశారు.