తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఊడిపోవడం తధ్యమన్నారు. రేవంత్ రెడ్డిని పీకి పడేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.
పేద ప్రజలను అణగదొక్కుతూ.. వాళ్ల జీవితాలను నాశనం చేస్తూ ఇండ్లను నాశనం చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతూ బుల్డోజర్ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉందని తెలిపారు. సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవడం కాదు.. తీర్థం తాగు అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హుడే కాడు. సోనియాగాంధీ వల్లనే రేవంత్ లాంచి ఛిచోర వ్యక్తి సీఎం అయిండు అన్నారు. దమ్ముంటే కొడంగల్ లో రాజీనామా చేసి గెలువు బిడ్డ అని సవాల్ విసిరారు దాసోజు శ్రవణ్.