తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 01 వరకు సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని నోటీసులలో కోరారు ఢిల్లీ పోలీసులు. అమిత్ షా మాట్లాడినట్టు ఉన్న ఫేక్ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఉంది. అయితే అసలు వీడియో లో మాత్రం తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగవిరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ పేర్కొంది.
కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేశారని బీజేపీ పేర్కొంటుంది. వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ చెప్పడంతో నష్టం వాటిల్లేవిధంగా ఉందని.. నోటీసులు పంపారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఈ అమిత్ షా ఫేక్ వీడియో పై ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.