రేపే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలోకి రేసు గుర్రాలను దించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలో రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. వివాదాలకు తావులేని 70కిపైగా నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఒక్కో నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో కేంద్ర స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా పంపారు. ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమనే భావన సభ్యుల్లో వ్యక్తమైంది. 43 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో వాటికి అభ్యర్థుల ఖరారు బాధ్యతను సీఈసీకి.. స్క్రీనింగ్‌ కమిటీ వదిలేసింది.
వామపక్షాలతో పొత్తు, బీఆర్​ఎస్​, బీజేపీల నుంచి ముగ్గురు ప్రముఖులు వచ్చే అవకాశముందని, వారి కోసం ఆరు సీట్లు పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news