తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు – కాంగ్రెస్‌ ప్రకటన

-

తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు ఉందని కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. బీఆర్‌ఎస్‌ పాలనలో గత పదేళ్లలో తెలంగాణ అప్పులు రూ.72,658 కోట్ల నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

కాపటి క్రితమే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందని తెలిపింది.

తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నట్లు వివరించింది.. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు ఉందని ప్రకటించింది. పదేళ్లలో సగటున 24.5 శాతం తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రుణం రూ.3లక్షల 89 వేల కోట్లు అని వివరించింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news