తెలంగాణ శాసనసభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసింది. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని ఈ సందర్భంగా భట్టి అన్నారు.
గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని ఆరోపించారు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలనే శ్వేత పత్రం విడుదల చేశామని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలోని కీలక అంశాలు ఇవే
- రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
- 2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.
- 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
- 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
- 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
- 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
- బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
- 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం
- రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
- రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం