నేటి నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

-

తెలంగాణలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షకు హాల్‌టికెట్లు ఈరోజు (జులై 11వ తేదీ 2024) సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి సీబీటీ బేసిడ్ టెస్ట్ నిర్వహించనుంది.

డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ ఇదే..

జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష

జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష

జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు

జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష

జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష

జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

Read more RELATED
Recommended to you

Latest news