తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్లు – 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈసారి బీటెక్ సీట్లు తగ్గాయి. ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు 173 ఉండగా… వాటిల్లో మొత్తం సీట్లు 98,296. ప్రైవేట్ కళాశాలల్లోని సీట్లలో 70 శాతాన్ని కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఆ ప్రకారం ఈసారి 70,307 సీట్లకు విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు. రెండు, మూడు విడతల కౌన్సెలింగ్ నాటికి మళ్లీ సీట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా 91,530 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు ఈఏపీ సెట్ కన్వీనర్ దేవసేన ప్రకటించారు. ఈనెల 6వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కాగా 25వేల41మంది హాజరైనట్లు తెలిపారు. ఓయూ సహా ఏడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న 19 ఇంజినీరింగ్ కాలేజీల్లో 5343 సీట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ దేవసేన వెల్లడించారు.