మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ మధ్యంతర సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మరమ్మత్తులు ప్రారంభించింది ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ. వరదకు అడ్డంకులు లేకుండా 7వ బ్లాక్ లోని గేట్లను పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకుంది. 7వ బ్లాక్ లోని 14-15 పిల్లర్ల మధ్య గేట్ ఎత్తారు ఇంజినీర్లు. 19, 20, 21 పిల్లర్ల మధ్య గేట్లు మినహా మిగతా వాటిని ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
7వ బ్లాక్ ముందు ఉన్న ఇసుక మేటలు, రాళ్లను సైతం తొలగించనుంది ఎల్ అండ్ టీ. గేట్లు పూర్తిగా ఎత్తిన తర్వాత మరమ్మత్తులకు సన్నద్ధం కానుంది. అటు మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల రిపేర్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ ఆరా తీశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు.