తెలంగాణ మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. త్వరలో తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. బీర్లు, స్పిరిట్‌లపై రేట్లు సవరించనుందట తెలంగాణ ప్రభుత్వం. గతేడాది తగ్గించిన స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ని పెంచడంతో పాటు ధరలను పెంచాలన్న యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చేలా మద్యం ధరలను సవరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ…ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. స్పిరిట్‌లపై రూ.20, బీర్లపై రూ.10 పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. దీంతో తెలంగాణ మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.