హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరం బాచుపల్లి నారాయణ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషను…. ఈ రోజు హాస్టల్లో వదిలేసి వెళ్లారు అనూష తల్లిదండ్రులు.
అయితే… తల్లితండ్రులు సిటీ దాటిలోపే అనూష స్పృహ కోల్పోయిందని సమాచారం ఇచ్చింది కాలేజీ యాజమాన్యం. కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని తెలిపింది యాజమాన్యం. తల్లితండ్రులు వచ్చేసరికి గాంధీ ఆసుపత్రికి తరలించింది కాలేజి సిబ్బంది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.