మాస్క్ లేకపోతే 1000 జరిమానా ;తెలంగాణ ప్రభుత్వం

-

మాస్క్ ధరించండి అని ఎంత మంది చెప్తున్నా సరే కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. మాస్క్ లేకపోతే కరోనా వస్తుంది అని మాస్క్ ని పెట్టుకోవడం మంచిది అని చెప్తున్నా సరే చాలా మంది మాస్క్ లు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిచినా సరే ఇప్పుడు పరిస్థితి మారడం లేదు.

ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. తాజాగా మాస్క్ లేకపోతే ఇక ఏ మాత్రం కూడా ఊరుకోవద్దు అని తెలంగాణా సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఇక జరిమానా పడుతుంది. ష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌ పొడిగింపు, అమలుకు సంబంధించి గురువారం జారీ చేసిన జీవోలో మాస్కు నిబంధనను ప్రస్తావించింది. ఫైన్ వేసే అధికారం స్థానిక పోలీసులకు ఉంటుంది అని ప్రభుత్వం చెప్పింది. అధికారులు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని స్పష్టంగా చెప్పింది. కాగా తెలంగాణా లో లాక్ డౌన్ ని మే 29 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news