తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరిధిలోని బుద్వేల్ లో ఉన్నటు వంటి 100 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమైంది తెలంగాణ సర్కార్. ఏకంగా 14 ప్లాట్స్ ను ఈ వేలం వేసేందుకు సిద్దం అయింది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ నిర్దేశిత కనీస ధర ఎకరానికి రూ. 20 కోట్లుగా ఉంది. ల్యాండ్ పార్శిల్ ప్యాకేజీలో మూడున్నర ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు అమ్మకానికి పెట్టింది కేసీఆర్ సర్కార్.
కోకాపేట నియోపోలీస్ లే ఔట్ నుంచి 15 నిమిషాల ప్రయాణం అంటూ సర్కారు ప్రకటన చేసింది. కాగా, కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలం బంగారు గనులను తలపిస్తోంది. నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. గురువారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగింది. 10వ నెంబర్ ప్లాట్‌కి సంబంధించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్క్‌ని టచ్‌చేసింది. ఇప్పటివరకైతే ఇదే ఆల్‌టైమ్ రికార్డు ధరగా నమోదయినట్టు తెలుస్తోంది.