కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ

-

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాన‌ది నుంచి అద‌నంగా నీరు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డుకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ ప్ర‌భుత్వ త‌ర‌పున‌ మూడు లేఖ‌ల‌ను రాశారు. తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా 45 టీఎంసీల నీరు వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కృష్ణ‌న‌ది యాజ‌మాన్యం బోర్డు ను లేఖ ద్వారా కోరారు. అలాగే పోల‌వ‌రం ద్వారా 80 టీఎంసీల నీటిని త‌ర‌లిస్తున్నార‌ని తెలిపారు. అలాగే రాష్ట్రానికి కూడా జ‌లాల‌ను అద‌నంగా ఇవ్వాల‌ని ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ కోరారు.

సాగ‌ర్ ఎడమ కాలువ పై ప‌థ‌కాల గురించి ఏపీకి అభ్యంత‌రాలు అక్క‌ర్లేద‌ని అన్నారు. అలాగే కృష్ణా న‌దిపై ఏపీ ప్ర‌భుత్వం రూ. 47 వేల కోట్ల‌తో ప్రాజెక్టులు చెప‌ట్టింద‌ని అన్నారు. ఈ కొత్త ప్రాజెక్టులు ప‌నులు అలాగే విస్త‌ర‌ణ పనుల‌ను కూడా వెంట‌నే ఆపాల‌ని కోరారు. అలాగే కృష్ణాన‌ది పై ఉన్న శ్రీ‌శైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ కు కేటాయించిన 34 టీఎంసీల కంటే ఎక్కువ వినియోగించు కోకుండా చూడాల‌ని కోరారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఔట్‌లెట్ల వద్ద సెన్సార్లు పెట్టాలని కృష్ణా న‌ది యాజ‌మాన్యాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news