పింఛన్ మొత్తాన్ని తిరిగిచ్చేయండి .. వారందరికి సర్కార్ నోటీసులు

-

రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమవుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ‘ఆసరా’ పొందుతున్నట్లు వెలుగులోకి రావడంతో  విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్లకార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పని వారు, దివ్యాంగులు, డయాలసిస్, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు ఈ పింఛనుకు అర్హులు. అయితే  కొందరు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబీకులు, పదవీ విరమణ అనంతరం పొందే పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు అందుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ నిధులను వెంటనే వారు ఎప్పటి నుంచి ‘ఆసరా’లో పేరు నమోదు చేసుకొని దానిని పొందారో, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news