ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు

-

తెలంగాణలో నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గురుకుల నియామక పరీక్షల తేదీలు ఖరారు చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఏరోజు ఏ పరీక్ష నిర్వహించనున్నారు.. తదితర వివరాలతో రెండు రోజుల్లో సమగ్ర షెడ్యూలు విడుదల చేస్తామని బోర్డు కార్యనిర్వాహక అధికారి మల్లయ్య బట్టు గురువారం తెలిపారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలు, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 5న గురుకుల నియామక బోర్డు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులన్నింటికీ కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news