డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

-

తెలంగాణ‌లో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం నుంచి నిర్వహించనున్న ఈ పరీక్షలు రాయలేక పోయిన విద్యార్థులకు త్వరలోనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, వాటిలో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు లను ధర్మాసనం రికార్డు చేసింది.

గతంలో ఇదే షరతుతో పదో తరగతి పరీక్షలు, పీజీ మెడికల్‌ విద్యార్థుల పరీక్షలకు అనుమతి నిచ్చిన విష యాన్ని ధ‌ర్మాస‌నం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష లను ఆపడానికి సహేతుకమైన కారణాలేవీ లేవని కోర్టు తేల్చిచెప్పింది. అయితే కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news