తెలంగాణలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, నిద్రమత్తులో డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఇలా రకరకాల కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.
గతేడాది రాష్ట్రంలో ఈ ప్రమాదాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో 10వ స్థానంలో నిలిచింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ దేశంలో 2022 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు, వాటికి గల కారణాలు ఇలా అనే అంశాలో ఈ నివేదికలో పొందు పరిచింది.
ఈ నివేదిక ప్రకారం 2021లో 21,315 రోడ్డు ప్రమాదాలతో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో ఉండగా 2022లో 21,619కు పెరిగింది. 2022లో దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 4.7 శాతం తెలంగాణలో జరగ్గా.. 7,559 మంది మరణించారు.
రాష్ట్రంలో ఒంపుల్లేని రోడ్లమీద 15,927 ప్రమాదాల్లో 5,689 మంది మరణించారు. 14,772 మంది గాయపడ్డారు. ఒంపుఉన్న రోడ్డుపై 1647 ప్రమాదాల్లో 632 మంది మృతి చెందారు. 1703 మంది క్షతగాత్రులయ్యారు. ఇక రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఏకంగా 153 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 40 మంది మరణించగా 129 తీవ్రంగా గాయపడ్డారు. జంక్షన్ల వద్ద 2542 ప్రమాదాలతో రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉంది.
- 4012 మంది పాదచారులు ప్రమాదాలకు గురికాగా 1458 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 10,657 ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో. 3977 మంది
- 1075 ఆటో ప్రమాదాల్లో 334 మంది
- 3057 కారు ప్రమాదాల్లో 588 మంది
- 1119 లారీ ప్రమాదాల్లో 397 మంది .
- 385 బస్సు ప్రమాదాల్లో 98 మంది మరణించారు.