తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం కేసీఆర్

-

 సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

మార్కెట్‌లో కాసేపు కలియతిరిగి దానిని పరిశీలించారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  సీఎం  మాట్లాడుతూ సూర్య పేట జిల్లా కావడం ఓ చరిత్ర అన్నారు సీఎం కేసీఆర్. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. 23వ జిల్లా కలెక్టర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలే సరిగ్గా లేవు అన్నారు. మీ దగ్గర కలెక్టరేట్లు, సెక్రేటేరియట్ కార్యాలయాలు ఇంత బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. జట్టు కట్టి పట్టుపడితే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు కేసీఆర్.  అదేవిధంగా తెలంగాణలో ఆకలి లేదు.. పస్తులుండాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news