బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

-

బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక్కో సమస్యను పరిస్కరించుకున్నాం. రైతు బంధు కావాలని ఎవ్వరూ అడగలేదు.. అయినా మనం రైతుల కోసం ఆలోచించి రైతుబంధు, రైతుబీమా గురించి చెప్పారు. రైతుబంధు పథకానికి అంతర్జాయంగా ప్రశంసలు వస్తున్నాయి. వెనుకబడిన దళితుల కోసం దలిత బంధు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకాన్ని జవహర్ లాల్ తీసుకొస్తే.. దళితులకు ఎప్పుడో మేలు జరిగేది.


ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు.. ఓటును జాగ్రత్తగా వినియోగించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి భారీ మేజార్టీతో గెలిపిస్తారని ఆశీస్తున్నా. అంకాపూర్ కి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. అంకాపూర్ గురించి ఎక్కువగా ప్రచారం చేసింది తానేనని చెప్పారు సీఎం కేసీఆర్. ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు.. ఆ ఆసుపత్రిలో గర్భీణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news