తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

-

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. ఐసెట్ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి.

ఐసెట్ ఫలితాలను icet.tsche.ac.in అధికారిక వెబ్ సైట్ లో  చెక్ చేసుకోవచ్చు. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. కాగా తెలంగాణ ఐసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news