ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు?

-

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయులుకు సీఎం పేషీలో ఘోర పరాభవం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఛాంబర్లోకి అనుమతి లేకుండా వెళ్లేందుకు ఇద్దరు అధికారులు వేర్వేరుగా ప్రయత్నాలు చేశారు. అయితే… ఛాంబర్ నుంచి బయటకు వెళ్లాలని సీఎస్ ద్వారా శ్రీ లక్ష్మికి చెప్పించారు చంద్రబాబు.

Chandrababu insulted IAS Srilakshmi

ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కూడా సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలుస్తానంటూ హడావిడి చేశారు. కార్యాలయం నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఇంటెలిజెన్స్ ఏడీజీ ద్వారా పీఎస్స్సార్ ఆంజనేయులుకు ఆదేశాలు ఇచ్చారు. ఐదేళ్లుగా వైసీపీతో అంటకాగారని శ్రీలక్ష్మీ, పీఎస్సార్ పై అభియోగం ఉంది. ప్రత్యేకంగా కలవడం కుదరకపోవడంతో సీఎం చంద్రబాబు నిర్వహించిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు శ్రీలక్ష్మీ, పీఎస్సార్. అటు ఇవాళ శ్రీ లక్ష్మీ ఇచ్చిన బొకేన్‌ ను కూడా చంద్రబాబు తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news