నాలుగు పథకాల ప్రారంభంపై తెలంగాణ కీలక ప్రకటన వెలువడింది. నేడు నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో నాలుగు పథకాలు ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో 4 పథకాలను ప్రారంబించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మంజుపల్లిలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా, గుండ్లపోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రారంభించనున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మలుగు జిల్లా ములుగు మండలంలోని జీవంతరావుపల్లిలో ప్రభుత్వ పథకాలు ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. కొల్లాపూర్ లో నిర్వహించనున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.