రాష్ట్రపతి నిలయంలో మూడు రోజుల పాటు ‘తెలంగాణ విమోచన వేడుకలు’

-

సెప్టెంబర్ 17వ తేదీని ఓవైపు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంటే మరోవైపు బీఆర్ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించనుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జరగనుంది. మరోవైపు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్​లో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించనున్నారు.

ఇంకోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని… రాష్ట్రపతి నిలయంలో మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం వ్యవహారాల ఇన్‌ఛార్జీ రజినీప్రియ తెలిపారు. వివిధ కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారని.. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్‌దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ఐక్యత, సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతాయని రజినీప్రియ తెలిపారు. రంగస్థలం,ఎస్ ఎ రాతలు,క్విజ్,పాటల,చిత్ర లేఖనం పోటీలు,ఖాదీ ఫ్యాషన్ షో,ఫోటో ఎక్సిభిషన్,ఐక్యత ర్యాలీ ప్రదర్శన ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news