ఇండియా క్రికెట్ టీం కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్… !

-

ఇండియా మెన్స్ క్రికెట్ లో ఇప్పుడు మూడు టీం లు అయినా ఒకేసారి వివిధ టోర్నమెంట్ లు ఆడడానికి అనుకూలంగా ప్లేయర్స్ ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ క్రికెట్ టీం ఆసియా కప్ లో ఆడుతోంది.. ఈ టీం కు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉండగా రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా తో వన్ డే సిరీస్ మరియు స్వదేశంలో వన్ డే వరల్డ్ కప్ లను ఆడనుంది. అయితే ఇదే సమయంలో చైనా వేదికగా ఆసియా గేమ్స్ ఉండడంతో, ఇండియా మెన్స్ టీం అందులో పాల్గొనాల్సి ఉంది. ఈ జట్టును కూడా బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఈ జట్టుకు ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా ఇండియా జట్టు డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్ దశలో టోర్నమెంట్ లోకి ఎంటర్ కానున్నారు. ఇప్పుడు ఈ జట్టుకు కోచ్ గా వి వి ఎస్ లక్ష్మణ్ వారితో కలిసి వెళ్లనున్నారు.

బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే మరియు ఫీల్డింగ్ కోచ్ గా మునీష్ బాలి చేయనున్నారు. ఇక ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 3వ తేదీన జరగనుంది మరి ఆసియా గేమ్స్ల లో లక్ష్మణ్ కోచ్ గా బంగారు పతకం సాధిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news