తెలంగాణాలో ఏ బ్రాండ్ కి ఎంత రేట్ పెరిగింది అంటే…

-

తెలంగాణా సర్కార్ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు చేపడతారు. భౌతిక దూరం పాటించి కచ్చితంగా మాస్క్ ధరించిన తర్వాతే మద్యం అమ్మకాలు జరుపుతారు. జనాలు ఎవరైనా ఎగబడితే మాత్రం ఫోటోలు బయటకు వస్తే మాత్రం ఇక మ్యూజిక్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది.

ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం లేదని తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఇక తెలంగాణాలో మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని, ఇప్పుడు ఆదాయం కోసం ధరలను పెంచాల్సిన అవసరం ఉందని అందుకే పెంచాం అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు. కేవలం 15 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం షాపులు తెరవడం లేదన్నారు.

ఇక పెరిగిన మద్యం ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే,

కేటగిరి 90 ఎంఎల్/180 ఎంఎల్ 375 ఎంఎల్ 750 ఎంఎల్
ఆర్డినరీ రూ.10 రూ.20 రూ.40
మీడియం రూ.20 రూ.40 రూ.80
ప్రీమియం రూ.30 రూ.60 రూ.120
స్కాచ్ రూ.40 రూ.80 రూ.160
బీర్ (అన్ని సైజులపై) ఫ్లాట్ రూ.30

Read more RELATED
Recommended to you

Latest news